ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీలను అమలు చేయకుంటే వదిలిపెట్టం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో నల్గొండ లోక్ సభ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే హీరోలు, వారి వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఎన్నికల ప్రచారము అనుకూలంగా అనిపించినప్పటికీ ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదు.కానీ ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మినహా ,ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి.పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సమన్వయ లోపం వల్లనే ఈ ఈ పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.కోమటిరెడ్డి గత నవంబర్ నెలలోనే కరెంట్ బిల్లులు కట్టొద్దని ఆయన అన్నారు అని గుర్తు చేశారు. నల్గొండ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టకుండా వాటిని కోమటిరెడ్డికి పంపించాలని కేటీఆర్ అన్నారు.