ఒమిక్రాన్… వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి… తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల అందరికీ… ఆర్ టి పి సి ఆర్ టెస్టులు చేస్తామని వెల్లడించారు శ్రీనివాస రావు. అయితే ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తే… గచ్చిబౌలి లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించామని ఆయన ప్రకటన చేశారు.
తెలంగాణలో ఒమిక్రాన్ ఇంకా ప్రవేశించలేదని.. అసత్య ప్రచారాలు ఎవరూ కూడా నమ్మవద్దని.. అలాగే ఎవరూ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి 41 మంది హైదరాబాద్ వచ్చారని… వారికి కరోనా పరీక్షలు చేశాం.. ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.