Breaking : ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్ ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ 2023-24 ప్రతిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు.

ఈ స‌మావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2. 85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చన్నది విశ్వసనీయ సమాచారం. అయితే.. వచ్చే నెల 3వ తేది నుంచి శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం వెనుక సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ఈసారి కూడా గవర్నర్‌ తమిళిసైకి ఝలక్ ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version