ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచార కార్యక్రమాలకు తెరపడింది. మరో రెండు రోజుల్లో తెలంగాణ అసంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణాలో మొత్తం 3 .26 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 1 .62 కోట్ల మంది పురుషులు కాగా, 1 .63 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇందులో ట్రాన్స్ జెండర్ లు 2676 మంది మరియు సర్వీస్ ఓటర్లు 15406 మంది, ప్రవాస ఓటర్లు 2944 మంది ఉన్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య 2290 గా ఉంది, వీరిలో 221 మంది మహిళలు అనగా ఒకే ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే మహిళా ఓటర్లు మరియు యువత కనుక ఏ పార్టీకి అయితే అండ కావాల్సి ఉంది.
అధికారంలో ఉన్న BRS గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా అన్న రెండు విషయాలే రాష్ట్రంలో వైరల్ అవుతున్నాయి.. బీజేపీ అస్సలు పోటీలో లేనే లేద్న్హు అంటూ రాజకీయ ప్రత్యర్ధులు అంటున్నారు.