గౌహతి టీ 20 లో ఇండియా మరియు ఆస్ట్రేలియా లు ఆడుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సూర్య సేన నిర్ణీత ఓవర్ లలో 222 పరుగులు చేసింది. ఈ స్కోర్ ఇండియా సాధించడానికి ఒకే ఒక్కడు కారణం… ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్, ఓపెనర్ గా వచ్చి చివరి బంతి వరకు క్రీజులో నిలబడి ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడాడు. చివరికి గైక్వాడ్ 57 బంతుల్లోనే 123 పరుగులు చేసి తొలిసారిగా తన కెరీర్ లో టీ 20 లలో సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 13 ఫోర్లు మరియు 7 సిక్సులు ఉండడం విశేషం. ఇక ఈ సెంచరీ తో గైక్వాడ్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పై ఇండియా బ్యాట్స్మన్ ఎవ్వరూ కూడా టీ20 లలో సెంచరీ చేసింది లేదు.
మొదటిసారి గైక్వాడ్ ఆసీస్ పై సెంచరీ సాధించి ఒక్క మగాడుగా ఘనను అందుకున్నాడు. అడపాదడపా గైక్వాడ్ రాణిస్తున్న ఇండియాకు రెగ్యులర్ ఆటగాడిగా మాత్రం అవలేకపోతున్నాడు.