తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు వైటీ దాడులు మరోవైపు ఈడి సోదాలు. కేంద్రం వైఖరి పై భగ్గుమంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా బిజెపి తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
వచ్చే వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడుతున్న కేంద్రం వైఖరితో పాటు ఐటీ, ఈడీ దాడులపై కీలకంగా చర్చించనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించే సీఎం కేసీఆర్ హైదరాబాద్ కి చేరుకున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఈ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది.