కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను ఢిల్లీలో కాసేపటి క్రితమే తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. అమిత్ షా ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , మాజీ మంత్రి ఈటల రాజేందర్ , వివేక్ వెంకటస్వామి, రవీందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీ పార్టీ లో చేరిన తరువాత తొలిసారిగా అమిత్ షా ను మాజీ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు.
హుజురాబాద్ ఉపఎన్నికల పాదయాత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితులను అమిత్ షా కు వివరించారు నేతలు. అంతేకాదు… కేంద్ర మంత్రులు హుజురాబాద్ ప్రచారంలోకి రావాలా ? వద్దా ? అనే దానిపై నేతలు చర్చించినట్లు సమాచారం అందుతోంది. అమిత్ షా భేటీ తర్వాత…. సాయంత్రం 6 గంటలకు భూపేందర్ యాదవ్ ను బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ కలవనున్నారు. ఈ సమావేశంలోనూ హుజురాబాద్ ఉప ఎన్నికలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.