2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్లతో మొత్తం బడ్జెట్ ను ఆయన ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు ఆయన. ప్రవేశ పెట్టిన అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. ఇక వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఈ మేరకు ఉన్నాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు.
వ్యవసాయ శాఖ – రూ.25 వేల కోట్లు
పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు.
నీటిపారుదల శాఖ- రూ.16,931 కోట్లు.
బీసీ సంక్షేమ శాఖకు రూ.5,522 కోట్లు.
అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు.
బడ్జెట్ లోని హైలైట్స్ :
ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు.
మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు.
పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు.
రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు.