రైతులు, పేద ప్రజల ఆకాంక్షలకు అద్ధం పట్టేలా బడ్జెట్: హరీష్ రావు

-

రాష్ట్రంలోని రైతులు, పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా… తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని హరీష్ రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో మూడో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని…2022-23 బడ్జెట్ లో కేసీఆర్ మార్క్ కనిపిస్తుందని ఆయన అన్నారు. మానవీయ కోణంలో బడ్జెట్ రూపొందించామని హరీష్ రావు అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు.. బంజారాహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ రోజు ఉాదయం 11.30 గంటలకు శాసన సభలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా.. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే.. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ పై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version