నన్ను వదిలేసి..వేరే పెళ్లి చేసుకున్నాడు ; ప్రియుడిపై టాలీవుడ్‌ హీరోయిన్‌ సంచలనం !

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్యూటీ బిందు మాధవి. చిత్తూరు జిల్లాకు చెందిన బిందు మాధవి.. మొదట్లో తెలుగు పరిశ్రమలో పలు సినిమాలు చేసి… తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తమిళంలో ఫుల్‌ బిజీ అయిపోయింది బిందు మాధవి. ఆవకాయ బిర్యానీ, బంపర్‌ ఆఫర్‌, రామ రామ కృష్ణ కృష్ణ లాంటి పెద్ద సినిమాలు చేసింది బిందు.

అయితే.. తాజాగా బిందు మాధవి తన లవర్‌ ఎఫైర్‌ గురించి సంచలన విషయాలు చెప్పింది. తన కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించానని.. కానీ ఆ తర్వాత విడిపోయానని తెలిపింది. కెరీర్‌ కోసమే తాము దూరమయ్యామని.. ఉన్నత చదువుల కోసం అతను అమెరికా వెళ్లి పోయాడని పేర్కొంది బిందు.

తాను సినిమా ల మీద మక్కువతో ఇక్కడే ఉండిపోయానని.. అతుడు వేరే పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడితో ప్రేమ ఎప్పటికీ తనకు స్పెషలేనని బిందు మాధవి వెల్లడించింది. అయితే.. తన లవ్‌ బ్రేకప్‌ తర్వాత.. తాను డీప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పింది బిందు మాధవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version