తెలంగాన బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మంత్రులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రులు, ఫైనాన్స్ అధికారులు హాజరు కానున్నారు.
అందరితో చర్చించి బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు సీఎం. మార్చి 4 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించి బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో ఒకే సారి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అయితే ఈసారి రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ ఏ విధంగా ఉండాలి… ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై కూడా ఫైనాన్స్ అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.