రాష్ట్రంలో కిరాణం దుకాణాలు మద్యం షాపులుగా మారాయి : రఘునందన్‌

-

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలని సూచించారు. దివ్యాంగుల కోసం క్యాంపు పెట్టి ఈవీలు ఉచితంగా ఇవ్వాలని కోరారు.  బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదని ఆరోపించిన ఆయన.. బీసీలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ధరణి పోర్టల్​పై అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడి చర్చ సాగింది. ధరణి పోర్టల్‌ రైతులకు శాపంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఆరోపించారు. ధరణిలో లోపాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.6,000 కోట్లు ఖర్చు పెడతామని అన్నారని గుర్తు చేశారు. ఫెడరేషన్ ఏర్పాటు చేశారు కానీ.. ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఆరోపించారు. ఫెడరేషన్ బలోపేతం కోసం నిధులు మంజూరు చేయాలని శ్రీధర్‌ బాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version