తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు

-

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది.

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతిని ఎన్నికల సంఘం ఇచ్చింది.కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్‌పై సానుకూలంగా స్పందించిన ఈసీ.. క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులు విధించింది. ఈ భేటీలో కేవలం అత్యవరస అంశాలే చర్చించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version