కరోనా కట్టడి విషయంలో తెలంగాణా ప్రభుత్వం ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కరోనా కేసులు అక్కడ పెరుగుతున్నా సరే ప్రజలను ఎక్కడగా కంగారు పడకుండా జాగ్రత్తలు పడుతుంది తెలంగాణా సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రుల వరకు అందరూ కూడా ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ వెంట మేము ఉన్నామని అంటున్నారు.
ప్రజలు ఎక్కడా కూడా ఆకలి కేకలతో లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ బాధితులతో మంత్రులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటిఆర్, ఈటెల రాజేంద్ర ఇతర మంత్రులు అందరూ కూడా కరోనా బాధితులతో మాట్లాడుతున్నారు. ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స పొందుతున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు. ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
ఇక భయపడి బయటకు రాని వాళ్ళను కూడా వాళ్ళు ముందు ఉండి ప్రోత్సహించి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచితంగా వైద్యం చేయిస్తామని ఎవరూ కూడా డబ్బుల గురించి భయపడవద్దు అని అంతా ప్రభుత్వం చూసుకుంటుంది అంటున్నారు. ఇక లాక్ డౌన్ విషయంలో కూడా మంత్రులు చాలా సీరియస్ గా ఉంటున్నారు. ప్రజలను ఎవరిని కూడా బయటకు రానీయడం లేదు.
ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి చేసుకుంటూ అందరూ కూడా సమన్వయము తో పని చేస్తున్నారు. ఇక వైద్యులపై దాడి జరిగిన సమయంలో, పోలీసులు ఎక్కడైనా అనవసరంగా లాఠీ చార్జ్ చేసిన సమయంలో పోలీసులను హెచ్చరించడం అవసరం అయితే సస్పెండ్ చేయడం, వైద్యులకు ధైర్యం చెప్పడం వంటివి చేస్తున్నారు మంత్రులు. దీనిపై ఇప్పుడు తెలంగాణా సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నారు.