తమ్మా రెడ్డి కి మాతృ వియోగం.. పరామర్శించిన చిరంజీవి ..!

-

చిత్ర పరిశ్రమలో ఏ విషయన్నైనా నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అది సినిమాకి సంబంధిన విషయమైనా, ఒక సినీ సెలబ్రిటీకి సంబంధిన వ్యక్తి విషయం అయినా ఆయన ధోరణి మాత్రం ఒకేలా ఉంటుంది. వాస్తవం వైపే మాట్లాడి అందరికీ సపొర్ట్ చేసే తమ్మా రెడ్డి గారికి ఈ విషయం లో మోరల్ ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు గారు అని చెప్పాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి గారు ఈరోజు తుదిశ్వాస విడిచారు.

 

ఈ విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ స్వయంగా తెలిపారు. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడ్డారని ఆరోగ్యం క్షీణించడం తో తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా ప్రముఖ నిర్మాత. రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్‌ బాబు వంటి సూపర్ హిట్‌ సినిమాలను నిర్మించారు. ఆ వారసత్వాన్నే తమ్మారెడ్డి భరద్వాజ తీసుకొని సినిమాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. ముఖ్యంగా చిరంజీవితో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన కోతల రాయుడు మంచి సక్సస్ ని సాధించింది.

ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తమ్మారెడ్డి గారిని ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ హైదరా బాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు జార్జ్ రెడ్డి కి తమ్మారెడ్డి భరద్వాజ అత్యమంత సన్నిహితులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version