మంత్రి కేటీఆర్‌ ను ఓ ఆట ఆడుకుంటున్న వైసీపీ సోషల్‌ మీడియా

-

ఏపీలో కరెంట్‌, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు కాబట్టే హుజురాబాద్, దుబ్బాకలో లక్ష మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిందంటూ మాములుగా ఆడుకోవడం లేదు.

అలాగే… జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా సొంతంగా మేయర్ పదవి దక్కించుకోలేకపోయిందని.. కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కి జనాలు పరుగులు పెట్టడం మీకు ఇంకా గుర్తుండే ఉంది అనుకుంటా చిన్న దొర గారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.

2014 లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మీకు పవర్ లేదని మమ్మల్ని అడిగితే మీ మీద దయ తలిచి పవర్ సప్లై చేస్తే వాటి తాలూకా బాకీలు ఇంకా ఇవ్వకుండా సొల్లు కబుర్లు చెప్తుంది ఎవరు దొరా అని సెటైర్లు పేల్చుతున్నారు. కాగా.. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను నారా లోకేష్‌ ట్యాగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక కేటీఆర్‌ వ్యాఖ్యలుపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version