కరోనా వేళ ఇవేం కోరికలురా బాబు!

-

తినడానికి తిండిలేక ఒకడు ఏడుస్తుంటే… తిన్నది అరక్క మరొకడు ఏడ్చాడంట… అలా ఉంది కొన్న్ని కంటైన్ మెంట్ ప్రాంతాల్లో జనం సంగతి! కరోనా అంటే వేళాకోలం అనుకుంటున్నారో లేక పోలీసులను ఆటపట్టించాలని భావిస్తున్నారో .. అదీగాక పిచ్చి చేష్టలతో శునకానందం పొందుతున్నారో తెలియదు కానీ…. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో కొందరు జనాలు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారట!

వివరాళ్లోకి వెళ్తే… హలో సార్… నాకు వెంటనే బిర్య్యానీ పంపించండి! సార్… నాకు చికెన్ పంపండి, అది లేకపోతే మటన్ అయినా, ఫిష్ అయినా పర్లేదు! నిద్రపట్టడం లేదు మందు పంపండి.. అది దొరక్కపోతే నిద్రమాత్రలు అయినా పంపండి! సార్… ప్యాకెట్స్ అయిపోయాయి కండోంస్ పంపండి! హలో సార్… సిగరెట్లు పంపడం మరిచిపోకండి!… కంటైన్ మెంట్ ప్రాంతాల్లో కొంతమంది జనాలు కోరుతున్న కోరికలు. ఈ ప్రాంతాల్లో ఇంటికి అందచేస్తాం అని చెప్పినవి… నిత్యావ్సరాల సరుకులు, మందులు వంటివే! కానీ… ఈ బ్యాచ్ కి ఎలా అర్ధం అయ్యిందో తెలియదు కానీ… ఇలా పనికిమాలిన కోరికలు కోరుతూ… సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారట.

ఇంకా డీప్ కి వెళ్లి డిటైల్ గా చెప్పాలంటే… తాజాగా కూకట్ పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజానగర్ లో ఏర్పాటు చేసిన కంటైన్ మెంట్ జోన్ లో కొందరు కండోమ్, ఐపిల్ లు కావాలంటున్నారని సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఇక వెస్ట్ జోన్ పరిధిలోని 14 కంటైన్ మెంట్ లలో ఎక్కువ మంది చికెన్ / మటన్ కావాలని ఆర్డర్ వేస్తున్నారట. ఇందులో మరో శాదిజం ఏమిటంటే… తమకు డబ్బు కావాలని అడుగుతూనే… ఏటీఎం పిన్ నెంబర్లు చెప్పడం లేదంట! వారికోసం ఇంత కష్తపడి పనిచేస్తుంటే… ఈ శునకానందం ఏమిటిరా బాబు అని సిబ్బంది వాపోతున్నారంట! ఇలాంటివీ మరో 10 రకాల ప్రాణాంతక వైరస్ లు వచ్చినా… మనిషి మారడు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version