తెలంగాణలో కోరలు చాచిన కరోనా.. ఒక్కరోజే 985 మందికి పాజిటివ్.!

-

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏరియాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. శుక్రవారం నాడు కొత్తగా 985 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరుకుంది. మొత్తం 237 మంది మృతి చెందగా, కరోనా బారి నుంచి కోలుకొని 4,766 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 7,436 మంది బాధితులు కరోనాతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కాగా, నిన్న నమోదైన కొత్త కేసుల్లో 774 కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డి (86), మేడ్చల్ (53), వరంగల్ అర్బన్ (20) రాజన్న సిరిసిల్ల (6), మెదక్ (9), ఆదిలాబాద్ (7), నాగర్ కర్నూలు (6), నిజామాబాద్ (6), సిద్దిపేట్ (3), భూపాలపల్లి (3), ఖమ్మం (3), ములుగు (2), జగిత్యాల (2), యాదాద్రి భువనగిరి (2), వికారాబాద్ (1), మహబూబ్ నగర్ (1), మిర్యాలగూడ (1) చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version