తెలంగాణలో 60వేలు దాటిన క‌రోనా కేసులు..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 60,717కు చేరింది.

అదేవిధంగా మృతులు 505కు పెరిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 44,572 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య‌ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 521 కేసులు నమోదవ్వగా రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్ జిల్లాలో 15కు వరంగల్ అర్బన్ లో 102 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version