తెలంగాణలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు అవుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత కూడా భారీగా తగ్గుతోంది. ఏపీలో కంటే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1489 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 607925 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3521 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 19,975 గా ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,84,429 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 96.13 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 95.76 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.57% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,16,256 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 1,70,70,886 కు చేరుకుంది.