తెలంగాణ అప్పులు 2.83 లక్షల కోట్లు – కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

-

తెలంగాణ అప్పులు 2.83 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు రాత పూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. ప్రతి ఏటా తెలంగాణా అప్పులు వేల కోట్ల రూపాయాలు పెరుగుతున్నాయని.. రాష్ర్టం ఏర్పడిన 2014 నాటికి తెలంగాణా అప్పు 75,577 కోట్లు వుండగా 2022 నాటికి 2,83,452 కోట్లకు అప్పులు చేరుకున్నాయని వెల్లడించింది కేంద్రం.

ప్రభుత్వం చేస్తున్న అప్పులే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల నుండి అదనంగా తెలంగాణా రాష్ర్ట కార్పొరేషన్లు, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు వేల కోట్లు అప్పులు చేస్తున్నాయని…. నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు తీసుకుంటున్నాయని పేర్కొంది. నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటి వరకు 7144 కోట్ల రుణాలు అందాయని తెలిపింది. వేర్ హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నాబార్డ్ నుండి ఇప్పటివరకు తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు 85,227.94 కోట్ల రుణాలు తీసుకుందని పేర్కొంది కేంద్ర ఆర్థిక శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news