మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నాట తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తాజాగా బీసీ కులగణన రిపోర్టును విడుదల చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే… బీసీ కులగణన రిపోర్టును కేబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది.
ఆ కులగణన రిపోర్ట్ పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా బీసీ జనాభా తగ్గింది. మొన్న బీసీ కుల గణన రిపోర్టుపై, బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండడంతో.. నిన్న ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారట మంత్రులు.