తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు ఖరారు

-

తెలంగాణలో మే 25న ఎంసెట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ జరుగుతోంది. జులై 12 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసింది. 137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు, 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు, 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,302 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటా కింద 62,079 సీట్లు కేటాయించారు.

దీనికి తోడు నేడు సీట్ల సంఖ్యను విద్యాశాఖ ప్రకటించింది. రేపటి నుంచి జులై 8 వరకు వెబ్​ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ వెబ్​ ఆప్షన్లు పూర్తి అయిన తర్వాత జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్​ సీట్ల భర్తీ ఉంటుందని.. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 12 నుంచి 19 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్​ రిపోర్టింగ్​ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది.

అలాగే జులై 21 నుంచి 24 వరకు రెండో విడత ఇంజినీరింగ్​ ప్రవేశాలకు కౌన్సిలింగ్​ ఉంటుందని తెలిపింది. జులై 28న రెండో విడత ఇంజినీరింగ్​ సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 2న తుది విడత ఇంజినీరింగ్​ ప్రవేశాలు ప్రక్రియ ఉంటుందని.. అప్పటి నుంచి ఆగస్టు 4 వరకు తుది విడత వెబ్​ ఆప్షన్ల నమోదు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 7న తుది విడత ఇంజినీరింగ్​ సీట్లు కేటాయించి.. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వనున్నారు. మరలా ఆగస్టు 8న స్పాట్​ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version