Jagananna AmmaVodi 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్..నేడే జగనన్న అమ్మ ఒడి డబ్బులు జమ చేయనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే, ఇవాళ ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపులు నియోజకవర్గం వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరుతారు. అనంతరం 10 గంటలకు కురుపాం నియోజకవర్గం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
అక్కడి నుంచి 10.05 గంటకు బయలుదేరి రో డ్డు మార్గంలో 10.30 గంటలకు కురుపాంలోని సభాస్థలం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్నన్న అమ్మఒడి పధకంలో భాగంగా విద్యార్థుల తల్లుల అకౌంట్ లలో వేల రూపాయలు జమ చేయనున్నారు. గత సంవత్సరం లాగే ఈ సారి కూడా అందరి ఖాతాలో రూ. 13 వేల రూపాయలు జమ చేయనున్నారు. అయితే ఈ రోజు వరకు సచివాలయంలో KYC పూర్తి అయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో అమౌట్ జమ కానుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత KYC పూర్తి కాకపోతే జూన్ 28 తర్వాత KYC చేయించుకుంటే జులై మొదటి వారంలో వారికి అమౌంట్ పడుతుంది.