తుపాకీలతో బెదిరించి మరీ మేకలు, గొర్రెల దోపిడీ

-

ఈ నెల 29న బక్రీద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో గొర్రెల, మేకలు వంటి జీవాలకు రక్షణ కరువైంది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం ఆచారం. అయితే మేకలు, గొర్రెల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అనదగ్గ కరాచీలో మేకలు, గొర్రెలు, పశువులు దొంగతానికి గురయ్యాయన్న కేసులు గత కొన్నిరోజుల్లో ఎన్నో నమోదయినట్లు సమాచారం.

వేరే ప్రాంతాల్లో పశులను అమ్మేందుకు వెళుతున్న వారిని బెదిరించి, జీవాలను అపహరిస్తున్నారంటే పాక్ లో పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను తీసుకెళ్లారు. పాకిస్థాన్ లో సాధారణ దొంగతనాలే అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయనుకుంటే, ఇప్పుడు బక్రీద్ సీజన్ లో మేకలు, గొర్రెలను చోరీ చేస్తున్న ఘటనలు అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయట. దాంతో కరాచీ నగరంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు షాహీన్స్ పేరిట ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version