తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర ఎక్ససైజ్ మరియు ప్రొహిబిషన్ డైరెక్టర్ ముషారఫ్ అలీ భారీ షాక్ ఇచ్చాడు. ఇంతకు ముందు వరకు ప్రజలు లిక్కర్ ను ఇతర రాష్ట్రాల నుండి కొంత పరిమాణం వరకు తీసుకువచ్చే అవకాశం ఉండేది. ఉదాహరణకు: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ల కన్నా గోవా, మహారాష్ట్ర లలో మద్యం ధరలు తక్కువే అని చెప్పాలి. అందుకే అక్కడకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తీసుకువస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలకు బ్రేక్ వేశారు. ఏ విధంగా అయినా తెలంగాణ లోకి మద్యం రావడానికి అస్సలు వీలు లేదని డైరెక్టర్ ముషారఫ్ అలీ ప్రకటించారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి రోడ్డు, రైలు, విమానం మరగల ద్వారా తీసుకువస్తూ పట్టుబడితే వారికి తెలంగాణ ఎక్సయిజ్ యాక్ట్ 1968 లోని సెక్షన్ 9 ప్రకారం 6 నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష తప్పదంటూ పేర్కొన్నారు.
షాకింగ్ న్యూస్: ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ తీసుకొస్తే జైలు శిక్ష
-