కిక్కే కిక్కు.. మద్యం విక్రయాలతో తెలంగాణకు రూ.32వేల కోట్ల రాబడి

-

తెలంగాణ మందు బాబులు తమ సత్తా చూపించారు. బాటిల్ ఎత్తామంటే ఖజానా నిండాల్సిందేనని నిరూపించారు. మద్యం విక్రయాలతో ఖజానాకు కిక్కే కిక్కు అందించారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయిలో 72 వేల కోట్లు రూపాయిలు ఆదాయం తెచ్చి పెట్టగా.. ఆబ్కారీ శాఖ ఏకంగా 31 వేల 560 కోట్ల రాబడితో సత్తా చాటింది.

2022-2023 ఆర్థిక సంవత్సరంలో 35 వేల 36 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 42.99 కోట్లు లీటర్లు బీరు అమ్ముడుపోయింది. లిక్కర్‌ కంటే బీర్లే ఎక్కువగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లోనే జరుగుతోంది. హైదరాబాద్‌ జిల్లాలో 3739 కోట్లు, రంగారెడ్డిలో 8410 కోట్లు, నల్గొండలో 3538 కోట్లు, మేడ్చల్‌లో 1326 కోట్లు, మెదక్‌లో 2917 కోట్లు, ఆదిలాబాద్‌లో 1438 కోట్లు, కరీంనగర్‌లో 2934 కోట్లు, ఖమ్మంలో 2222 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 2488 కోట్లు, నిజామాబాద్‌లో 1652 కోట్లు, వరంగల్‌లో 3471 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version