తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని… చెబుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్… 11 నెలలు అయినా దానిపై ఎలాంటి ముందడుగు వేయలేదు. కానీ రేషన్ కార్డు విషయంలో తాజాగా శుభవార్త చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా పెళ్లి అయిన వారు అంటే తమ భాగస్వాములు, లేదా ఇటీవల జన్మించిన వారి పేర్లను.. పాత రేషన్ కార్డులో చేర్చుకునేలా… అవకాశం కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందట.
ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సమయం పడుతుందని సమాచారం. అందుకే ఎవరైనా రేషన్ కార్డులో పేరు., చేర్చుకొనాలనుకుంటే… వెంటనే చేర్చుకునేలా అవకాశం కల్పిస్తోందట. దీనికోసం స్థానిక మీసేవ కేంద్రాలకు వెళ్లి… అవసరమైన డాక్యుమెంట్స్ అడ్మిట్ చేస్తే…. దానికి పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలుపనుంది. అప్లై చేసుకున్న ఏడు రోజుల్లోనే… పాత రేషన్ కార్డులో పేరు… యాడ్ అవుతుందట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తుందట రేవంత్ రెడ్డి సర్కార్. పూర్తి సమాచారం కోసం https://civilsupplies.telangana.gov.in/ వెబ్ సెట్ ను సంప్రదించవచ్చు.