ఇంటర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివిధానాల ఖరారుపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. కాగా తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న అధికారికంగా వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేశామని.. ఇప్పుడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫస్ట్‌ ఇయర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు.అటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు.