“అఖండ” ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

-

అఖండ సినిమా ఫ్యాన్స్ కు శుభ వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా స్పెషల్ షో లకు… అలాగే టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే డిసెంబర్ రెండవ తేదీన హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున్ థియేటర్లో మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.

అయితే యాజమాన్యాలు కరోనా నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రద్దీ నియంత్రణకు ప్రైవేట్ సెక్యూరిటీ ని కూడా పెట్టుకోవాలని సూచనలు చేసింది. నిర్మాతలు,థియేటర్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ రేపు థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా ప్రాగ్యా జైస్వాల్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version