తెలంగాణ ప్రభుత్వం: విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 20 లక్షల సాయం.. విద్యార్థులూ ఇలా అప్లై చెయ్యండి..!

-

విద్యార్ధులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అనేక స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే విద్యార్ధులకి వుండే కొన్ని స్కీమ్స్ లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీం అనేది కూడా వుంది. దీని వలన విద్యార్హులకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ స్కీం కింద అర్హులైన ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. దీని వలన అర్హులైన వారికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది.
దీనితో అర్హులైన వాళ్ళు విదేశాలకి వెళ్లి చదువుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలని చూస్తే.. అర్హులైన ఎస్టీ విద్యార్థులు జూన్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి.

వయస్సు జూలై 1 నాటికి 35 గరిష్టంగా 35 ఏళ్లు ఉండాలి గమనించండి. విద్యార్థులు telanganaepass.cgg.gov.in ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలని గిరిజన సంక్షమ శాఖ సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version