వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్.. ఇక షురూ..!

-

వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులను రెడీ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు గ్రామ కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు.. బాదుడే బాదుడుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భారీ ఎత్తున టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయడంలో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు.

పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు, కార్యకర్తలకు సంక్షేమం కోసం లోకేష్ నేతృత్వంతో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి నిదర్శనమన్నారు. దీంతో పాటు నేడు రుయా ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై చంద్రబాబు స్పందిస్తూ.. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్‌పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుమారుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్లు తండ్రి తన బైకుపై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్ దుస్థితిని తెలియజేస్తోందన్నారు. ఈ ఘటన నన్నెంతో కలిచి వేసిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version