తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..గవర్నమెంట్ ఆఫీస్ల పై సోలార్ ప్లాంట్లు..!

-

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగుల పై ఫోటో వాల్ టైక్ సోలార్ ప్లాంట్ కు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే కొన్ని చోట్ల 650 కిలో వాట్ల సామర్థ్యం తో బిల్డింగ్ లపై సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తారు. ఇక ప్రాజెక్ట్ లను దక్కించుకునే సంస్థలు ప్రతి కిలో వాట్ కు 1500 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి జరిగేలా సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

జనవరి 10 లోగానే దీనికోసం బడ్లు ఏర్పాటు చేయాలి. ఇదిలా ఉండగా సౌర విద్యుత్ ను ఉపయోగించడం వల్ల థర్మల్ విద్యుత్ ఆదా అవుతుంది. అదే విధంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా సౌర విద్యుత్ దొరుకుతుంది కాబట్టి వాతావరణ నష్టం ఉండదు. మరోవైపు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కరెంట్ బిల్లులు కట్టడం లేదని దాంతో కరెంట్ కట్ చేసినట్టు ఇటీవల కాలంలో రకరకాల వార్తలు పుట్టుకువచ్చాయి. దాంతో కార్యాలయాల కు సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల బిల్లుల బాధ తగ్గి ప్రభుత్వం ఖజానా కూడా పొదుపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version