తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం, 5 నిమిషాల్లో కరోనా టెస్ట్ పూర్తి…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడిక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. హాట్ స్పాట్స్ ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం… అక్కడ ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలని కేంద్రం సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది.

ఇది పక్కన పెడితే… ఇప్పుడు కరోనా టెస్ట్ ని వేగంగా పూర్తి చెయ్యాలని భావిస్తున్న రాష్ట్ర సర్కార్… యాంటీ ర్యాపిడ్ బాడి టెస్ట్ కిట్స్ ని సరఫరా చేస్తుంది. దీని ద్వారా టెస్ట్ ని 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ టెస్ట్ లో కనుక పాజిటివ్ వస్తే వెంటనే రక్త నమూనా సేకరించి హైదరాబాద్ కి పంపిస్తారు. ఇప్పుడు ఈ కిట్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 25 వేల కిట్ల కోసం,

కేసీఆర్ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక కేంద్రం కూడా దక్షిణ కొరియా నుంచి 5 లక్షల కిట్స్ ని తెచ్చుకోవాలని భావిస్తుంది. అక్కడ ఈ కిట్స్ ని ఎక్కువగా తయారు చేస్తున్నారు. అలాగే లాలా జలంని కూడా పరీక్షించిన తర్వాత వాళ్లకు జ్వరం ఏదైనా ఉంటే హోం క్వారంటైన్ లో ఉంచాలని, వారి మీద ప్రత్యేక నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version