ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ తమిళిసై హాట్ టాపిక్ గా మారారు. గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య వివాదం చెలరేగుతోంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇష్యూ జరిగినప్పటి నుంచి… గవర్నర్ తమిళిసైతో సంబంధాలను తెంచుకుంది ప్రగతి భవన్. దీంతో అప్పటి నుంచి.. గవర్నర్ తమిళిసై.. ప్రతి సారి కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో తెలంగాణ మంత్రులు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలాగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని కూడా అనేశారు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై గవర్నర్ తమిళిసై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మందిలా విదేశాల నుంచి సూటుకేసులు పట్టుకుని.. తాను రాజకీయాల్లోకి రాలేదని వెల్లడించారు గవర్నర్ తమిళిసై.
ఓ ప్రముఖ ఛానెల్ కు గవర్నర్ తమిళిసై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ.. ఇండిపెండెంట్ గా ఉండాలని.. తాను బీజేపీ పార్టీలో చేరి.. ఈ స్థాయికి చేరానని స్పష్టం చేశారు. అలాగే.. కొంత మందిలా విదేశాల నుంచి సూటుకేసులు పట్టుకుని.. తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించి తమిళిసై అన్నారని సమాచారం.