తాను కూడా ఒక డాక్టరే… కాబట్టీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను పరిణామాలాను సరిగ్గా అంచనా వేయగలదు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందర రాజన్. ఈమేరకు ఆమె చొరవ తీసుకొని నేడు ఉదయం 11 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సిబ్బందితో ఆమె మాట్లాడనున్నారు. ఆసుపత్రుల్లో ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే అంశం పై ఆమె సూచనలు ఇవ్వనున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు, బిల్లింగ్, టెస్టింగ్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తూ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆమెకు నివేధిక ఇవ్వనున్నారు వాటిని పరిశీలించి ఆమె వారికి తగిన సూచనలు ఇవ్వనున్నారు. కరోనా ను అరికట్టేందుకు ప్రభుత్వమే కాదు ప్రైవేట్ యాజమాన్యాల అవసరం కూడా ఎంతగానో ఉందని ఆమె భావించారు. ఈమేరకు వారిని ప్రభుత్వానికి సహాయంగా ఉండమని కలిసి కరోనాను అరికట్టాలని సూచించనున్నారు. నేడు ఉదయం 11 ప్రాంతంలో వారితో మాట్లాడతానని ఆమె స్వయానా తన ట్వీట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ చర్చ లో ఆమెతో పాటు తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీలు కూడా పాల్గొంటారు.
I will be interacting with private hospitals with Covid isolation facilities tomorrow11am regarding covid management & public grievances for redressal from them on beds , Billings ,tesing etc for successful pvt-public participation in #corona eradication successfully& cardially
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 6, 2020