తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా ఉండే తెలంగాణ పాలిటిక్స్ లోకి ఈసారి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రస్తావన కూడా వస్తుండడమే ఇక్కడ కాస్త ఇంట్రస్టింగ్ విషయంగా చెప్పాలి. గవర్నర్ సౌందర్ రాజన్ పై గులాబీ బాస్ కేసీఆర్‌తో పాటు గులాబీ దళం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయ, మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్‌గా తమిళ సై వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై మధ్య పెద్దగా సఖ్యత కనిపించలేదు. ఆమె గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. మూడు నెలల పాటు సైలెంట్‌గా ఉన్న కెసిఆర్ ఇటీవలే గవర్నర్‌తో భేటీ అయ్యారు ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందా ? అన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే మధ్యలో తమిళసై తాను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను అని చేసిన ప్రకటన గులాబీ వర్గాలకు కాస్త చికాకు పుట్టించింది.
ఇప్పుడు గవర్నర్ తన కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఏకంగా జిల్లా టూర్లకు శ్రీకారం చుట్టారు. సోమవారం వరంగల్ వెళ్ళిన గవర్నర్.. మంగళవారం రోజంతా వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటన చేశారు. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆమె వివిధ సెక్షన్ల ప్రజలతో సమావేశమయ్యారు. ఈ పరిణామంతో షాక్ అయిన గులాబీ ప్రజాప్రతినిధులు హడావిడిగా ఈ విషయాన్ని కేసీఆర్‌కు చెపుతున్నారు. గర్నవర్ ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే ఇలా చేస్తున్నారని గులాబీ దళం ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే పాలనా పరంగా… ప్రజాక్షేత్రంలోకి వెళుతుండడం.. సమస్యలను తెలుసుకుంటానని చెపుతుండడం లాంటి మాటలు కేసీఆర్‌కు ఎంత మాత్రం నచ్చడం లేదట. ఆమె కేంద్రం చెప్పినట్టే చేస్తున్నారని భావిస్తోన్న కేసీఆర్ గర్నవర్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు టాక్.. ? ఏదేమైనా సీఎం వర్సెస్ గవర్నర్ మధ్య ఈ తరహా పరిణామాలు ఎటు వైపునకు దారి తీస్తాయో ? చూడాలి.