బతుకమ్మ పండగ వేడుకకు రాష్ట్రం సిద్ధం… చీరల పంపిణీ రేపటి నుండే.

-

తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. దసరా సందర్భంగా మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బంతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టింది. తెలంగాణ ఆడపడుచులకు ప్రతీ ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది.

రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రంగుల్లో విభిన్న డిజైన్లలో మొత్తం 800రకాల చీరలను తయారు చేసారు. మొత్తం 15012పంపిణీ కేంద్రాల్లో చీరల పంపిణీ జరగనుంది. ఈసారి చీరల పంపిణీకి 318కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 16వేల మగ్గాలపై 10వేల నేత కుటుంబాలు 6నెలల పాటు కృషి చేసి ఈ చీరలను తయారు చేసారని ప్రభుత్వం వెల్లడి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version