ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ఫీజులపై కొత్త మార్గదర్శకాలు విడుదల

-

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకి ఎప్పుడు అయితే పర్మిషన్ ఇచ్చారో ఆనాటి నుండి అవి దోపిడీ మొదలు పెట్టాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితుల నుంచి చికిత్స పేరుతో ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం తాజాగా ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది.

అంతేకాక ఫీజుల వివరాలను ఆస్పత్రిలోని కీలక ప్రదేశాల్లో డిస్ప్లే చేయాలని కూడా మార్గదర్శకాలలో పేర్కొంది. అంతేకాక దోపిడీకి ఆలవాలంగా మారిన పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో డిస్ప్లే చేయలని పేర్కొంది. అలానే కొవిడ్‌ చికిత్సకు వినియోగించే మందులకు ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలని స్పష్టం చేసింది. కరోనా బాధితులను డిశ్చార్జి చేసే సమయంలో సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని కూడా తెలంగాణా సర్కార్ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version