ఫుల్ జోష్ లో తెలంగాణా ప్రభుత్వం, కారణం ఏంటో తెలుసా…?

-

తెలంగాణా ప్రభుత్వంలో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్నాళ్ళుగా అప్పులతో ఇబ్బంది పడుతున్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి బయటకు వస్తుంది. ఆదాయ మార్గాలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయంగా స్థిరత్వం ఉండటం, శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో పలు కంపెనీలు, వ్యాపార సముదాయాలు తెలంగాణా వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

అసలు వాటికి కారణాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు తెలంగాణాను ఇబ్బంది పెట్టాయి. అమరావతికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త రాష్ట్రం కావడంతో అటు వైపు కంపెనీలు, వ్యాపారాలు వెళ్ళాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ఆందోళనకర పరిస్థితులు తెలంగాణకు కలిసి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని కూడా వివాదాస్పదంగా మారడం, అక్కడ కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్న నేపధ్యంలో,

తెలంగాణా వైపు చూస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వంలో స్థిరత్వం ఉండటం, ఆందోళన అనేది లేకపోవడం, హైదరాబాద్ అనేది శాశ్వతం కావడంతో సెటిల్ అవ్వాలి, వ్యాపారాలు విస్తరించాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు. దీనితో వాళ్లకు అనేక రాయితీలు కూడా ఇస్తుంది తెలంగాణా సర్కార్. దీనితో తెలంగాణా ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఇన్నాళ్ళుగా మరుగున పడిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్ళీ నిధులు కేటాయించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఏడు నెలల కాలంలో ఆదాయం భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్ సర్కార్ ఫుల్ జోష్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version