వైరల్ వీడియో; టిక్ టాక్ లో ఏపీ మహిళా ఉప ముఖ్యమంత్రి మంత్రి హల్చల్…!

-

టిక్ టాక్” ఈ రోజుల్లో చిన్నా పెద్దా ప్రతీ ఒక్కరు కూడా దీనికి ఒకరకంగా బానిసలు అయిపోయారు. వాళ్ళల్లో ఉన్న ప్రతిభను బయటపెట్టుకోవడానికి గాను చాలా మంది టిక్ టిక్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లలు, పురుషులు, వృద్దులు, విద్యార్ధులు ఇలా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా టిక్ టాక్ కి బానిస అయిపోయారు. సోషల్ మీడియాలో ఇప్పుడు టిక్ టాక్ హవానే ఎక్కువగా ఉంది.

హావ భావాలు పెట్టడం వస్తే చాలు టిక్ టాక్ లో వీడియో చేయడం, తమకు నచ్చిన పాటకు టిక్ చేసి వీడియో పోస్ట్ చేయడం. ఇక మహిళల విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు దీనికి ఎక్కువగా బానిసలు అయిపోయారు. కాళీ సమయాల్లో ఫోన్ చూసుకునే మహిళలు టిక్ టాక్ వీడియో ల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం, అందుకోసం ఎక్కువగా బట్టలు కూడా కొంటున్నారు.

ఇప్పుడు ఆ టిక్ టాక్ ని ప్రజా ప్రతినిధులు కూడా చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ముఖ్యమంత్రి జగన్ పై రాయలసీమ ముద్దు బిడ్డ అనే పాటకు ఆమె టిక్ టాక్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇది వైరల్ అవుతుంది. జగన్ మీద ఆమెకు ఉన్న అభిమానానికి వైసీపీ కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version