థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు : తెలంగాణ వైద్యశాఖ

-

కరోనా పరిస్థితులపై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుందని… పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేసింది. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప థర్డ్‌ వేవ్ వచ్చే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది తెలంగాణ వైద్య శాఖ. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం అయ్యాయని.. తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయని తెలిపింది.

తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు వచ్చారని… కోవిడ్ కట్టడికి మొదటినుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరణాల శాతం కేవలం 0.5 శాతం , రేకవేరిటీ రేట్ 98.5 శాతం ఉందని… 1-10 ఏళ్ళల్లోపు పిల్లలు కేవలం 3 శాతం మంది మాత్రము కోవిడ్ బారిన పడ్డారని తెలిపింది. 20 ఏళ్ళల్లోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందని పేర్కొంది. కోవిడ్ బారిన పడిన వారిలో 73% శాతం మంది 20 నుంచి 6 ఏళ్ళల్లోపు వారని వెల్లడించింది.  పిల్లల్లో కోవిడ్ సోకిన 100 శాతం కొలుకుంటున్నారని… తెలంగాణ లో వైరస్ పూర్తిగా కంట్రోల్ లో ఉందని వైద్యశాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version