Telangana ICET Counselling: తెలంగాణ ఐసెట్ రాసిన వాళ్లకు అలర్ట్… ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ తేదీ రిలీజ్ అయింది. మొదటి విడతలో భాగంగా ఆగస్టు 20న కౌన్సిలింగ్ ప్రారంభమై సెప్టెంబర్ 5వ తేదీతో ముగియనుంది.

ఈ నెల 20-28 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, 22-29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 25-30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 2 లోపు సీట్లను కేటాయిస్తారు. రెండో విడత సెప్టెంబర్ 8న ప్రారంభమై 16న ముగియనుంది.