తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ లింక్‌ ఇదే

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేటి క్రితమే.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్. దీంతో ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు వెబ్సైట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు దర్శనమించాయి.

ఇక ఇవాల సాయంత్రం వెబ్సైట్ లో మొదటి సంవత్సరం ఫలితాలు రిలీజ్‌ కానున్నాయి. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రెగ్యులర్ సప్లిమెంటరీ కలిపి 80.80 శాతం ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌ సైట్‌ నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని.. ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఏమైనా అనుమానాలు ఉంటే.. ఆ వెబ్‌ సైట్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version