తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ బోర్డు సిలబస్ తగ్గింపు చేసేందుకు నిర్ణయం తీసుకుందట. విద్యార్థుల పైన ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ బోర్డు సిలబస్ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నదట తెలంగాణ విద్యాశాఖ.
NCERT సిలబస్ ను దృష్టిలో ఉంచుకొని సైన్స్ తో పాటు ఇతర… సబ్జెక్ట్స్ లో లెసన్స్ ను కుదించాలని… డిసైడ్ అయిందట ఇంటర్ బోర్డు. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని అనుకుంటున్నారట. వచ్చే విద్య సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం ఇంటర్, 2026 నుంచి 2027 మధ్య సెకండ్ ఇయర్ లో దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లెక్కన ఇంటర్ కెమిస్ట్రీలో 30% అలాగే ఫిజిక్స్ లో 15%… జువాలజీ లో ఐదు నుంచి 10% సిలబస్ తగ్గే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.