పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సరైన ప్రాంతమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.హైటెక్ సిటీ సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతున్నదని తెలిపారు. రాష్ట్రంలో కాలుష్య నివారణకు 3,200 వేల ఈవీ బస్సులు తెచ్చామని, ఈవీ వాహానాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించామని వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, నగరంలో 55 కి.మీ మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. 2050 ప్రణాళికతో మంచినీటి వసతిని కల్పిస్తామని, 360 కి.మీ రీజీనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్,లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. రింగ్ రైల్వే ప్రతిపాదనల్లో ఉన్నదని, మెట్రో రైలు కనెక్టివిటీని పెంచుతున్నాని, ఓఆర్ఆర్,ట్రిపుల్ ఆర్ మధ్య పారిశ్రామిక మండళ్లకు మంచి అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చైనా తరహాలో పారిశ్రామిక క్లస్టర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.