తెలంగాణలో ‘దోస్త్’(డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్) నోటిఫికేషన్ విడుదల అయింది. జులై ఒకటి నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మరియు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ ఒకటి నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. జులై 1 నుండి 15 వ తేదీ వరకు మొదటి ఫేస్ రిజిస్ట్రేషన్స్ మొదలు కానుండగా.. జులై 3 నుండి 16 వరకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే జులై 22 న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. సీటు వచ్చిన విద్యార్థులు 27 వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత రిజిస్ట్రేషన్స్ 400 రూపాయల ఫీజుతో జులై 23 నుండి 27 వరకు.. అలాగే జులై 24 నుండి 28 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్స్ ఉండనున్నాయి. ఆగస్ట్ 4 న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఆగస్ట్ 5 నుండి 10 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా… మూడో విడత ఆగస్ట్ 5 నుండి 10 వరకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 18 న సీట్ల కేటాయింపు జరుగనుంది. ఆగస్ట్ 18 నుండి 21 వరకు అన్ని విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబర్ ఒకటి నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.