రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల వలన పెద్ద మొత్తంలో రైతుల పంటలు నాశనం అయిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇలా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించడానికి కేసీఆర్ సర్కారు ఒక ప్రణాళికను రూపొందించింది. కాగా పంటపై కేంద్రం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న నిబంధనల తేమలో 17 % ను మినహాయింపు కింద తీసివేస్తారు.మిగిలిన దానికి నష్టపరిహారం అందిస్తారు. అయితే తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వం పాత నిబంధనను మార్చి తేమ శాతాన్ని 20 శాతానికి పెంచాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా స్పందించడం లేదని మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి గంగుల అసంతృప్తి !
-