ఓపెన్ స్కూల్ టెన్త్ ఇంటర్ పరీక్షలు తేదీలు ఫిక్స్ అయ్యాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22 – 29 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు. గతంలో నమోదు చేసుకొని పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు, పరీక్షలు రాయని అభ్యర్థులకు అవకాశం కల్పించామని అధికారులు తెలియజేశారు.

జులై 28 ఆగస్టు 5 వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జరిమానాతో కలిపి ఆగస్టు 6 – 18 వరకు అవకాశాన్ని కల్పించారు. కాగా, పరీక్షల టైం టేబుల్ ను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.