ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు సరిపోవు అన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని పేర్కొన్నారు. నేను పీజీ చేశానంటూ ప్రశాంతి రెడ్డి మాట్లాడారు… నేను కూడా ఆమె పీహెచ్‌డీ చేసిందని మాత్రమే అన్నాను. వ్యక్తిగతంగా మాట్లాడలేదని చెప్పారు.

నవ్వారని అనిల్ కుమార్ యాదవ్ పై కేసులు పెట్టడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. కేసులు పెట్టడం సంప్రదాయం కాదని చెప్పారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదన్నారు. మా మైండ్ లోనే ఎవరెవరు ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటామన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఇళ్లపై దాడులు చేసే రాజకీయాలు లేవు అని వెల్లడించారు ప్రసన్న కుమార్ రెడ్డి.